విజయం వైపు పయనం చేస్తున్న కన్నప్ప ఫస్ట్ డే నుంచే పవర్‌ఫుల్ టాక్

థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ పౌరాణిక చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత స్పందనను పొందింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

విడుదలైన తొలి రోజే సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విజువల్స్, బీజీఎమ్, సాంగ్స్, మరియు నటీనటుల నటన సినిమాకు ప్రధాన హైలైట్స్‌గా నిలిచాయి. ప్రత్యేకంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో మంచు విష్ణు నటనపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు

ట్రేడ్ నివేదికల ప్రకారం, ‘కన్నప్ప’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు సమాచారం. ఇందులో భారత్‌లో రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని చెబుతున్నారు. మంచు విష్ణు కెరీర్‌లోనే ఇదే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం కావడం గమనార్హం.

ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేశారు. న్యూజిలాండ్‌లో దాదాపు ఎనిమిది నెలల పాటు చిత్రీకరణ జరగగా, మొత్తం 800 మంది సిబ్బంది ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసినట్లు సమాచారం. విశేషంగా, ప్రభాస్ మరియు మోహన్ లాల్ ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండానే పాల్గొనడం విశేషం.

శని, ఆదివారాల్లో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారికంగా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *